‘గుడ్ లక్ సఖి’కి క్రేజీ ఆఫర్ !

Published on Jun 5, 2021 8:03 pm IST

‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా గతేడాది లాక్డౌన్ టైంలో రిలీజ్ అవ్వాలి. అంటే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అయి ఏడాది గడిచిపోయింది. రెండు నెలల క్రితం ఒక కొత్త విడుదల తేదీని జూన్ 4 అంటూ నిర్మాతలు ప్రకటించారు. కానీ అంతలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది, రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది.

లేదు అంటే, ఈ సినిమా నిన్న గ్రాండ్ గా విడుదలయ్యేది. గతేడాది, కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు డిజిటల్ వేదికల పై ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోయేసరికి ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడింది. దాంతో ‘గుడ్ లక్ సఖి’కి డిజిటల్ లో క్రేజీ డిమాండ్ లేకుండా పోయింది.

ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి ఓటీటీ సంస్థ జీ5 నుండి మంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. మరి ‘గుడ్ లక్ సఖి’ గుడ్ టైం కోసం ఎదురుచేస్తోందో లేక, డిజిటల్ రిలీజ్ కి రెడీ అయిపోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :