చరణ్ నెక్స్ట్ స్టోరీ లైన్ అదేనట?

చరణ్ నెక్స్ట్ స్టోరీ లైన్ అదేనట?

Published on Jun 9, 2020 8:47 AM IST

Ram Charan 2

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. చరణ్ పుట్టిన రోజు కానుకగా భీమ్ ఫర్ రామరాజు పేరుతో విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆశ్చర్య కరంగా ఆయన పోలీసు లుక్ లో కనిపించి సినిమా కథపై ఆసక్తిని పెంచేశాడు. రామరాజు పోలీసు ఎలా అయ్యాడు అనేది ఇక్కడ ఆసక్తికర అంశం.

ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ చేయనున్న మూవీ ఏమిటీ అనే ఆసక్తి ఇప్పటికే ఆయన ఫ్యాన్స్ లో నెలకొని ఉంది. దీనిపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. చరణ్ తన నెక్స్ట్ మూవీలో కూడా ఓ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారట. ఆస్థి కోసం ఓ పాపను వెంటాడే గ్యాంగ్ నుండి కాపాడే పోలీస్ గా ఆయన పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొద్దిరోజులు ఆగాల్సిందే. ఇప్పటికే జంజీర్, ధృవ సినిమాలలో ఆయన పోలీస్ పాత్రలు చేశారు.

తాజా వార్తలు