మెగాస్టార్ ‘లూసిఫర్’ పై క్రేజీ రూమర్ ?

మెగాస్టార్ ‘లూసిఫర్’ పై క్రేజీ రూమర్ ?

Published on May 24, 2021 10:33 PM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మోహన్ద రాజా ర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రలో మంజు వార్యర్ అద్భుతంగా నటించింది. అయితే తెలుగు వర్షన్ లో ఈ పాత్రలో అనుష్క నటించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్త పై చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా అనుష్క ‘లూసిఫర్’లో ని చెల్లి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ సినిమా మిగిలిన క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో ఇప్పుడు హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని చిరు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు