మహేష్ హీరోయిన్ పై జోరుగా వార్తలు.

Published on Jun 5, 2020 8:57 am IST

సూపర్ స్టార్ మహేష్ అభిమానుల ఉత్కంఠకు తెరదించుతూ నూతన చిత్ర ప్రకటన చేశాడు. ఆయన గత నెల 31న కృష్ణ గారి పుట్టిన రోజు కానుకగా దర్శకుడు పరుశురామ్ తో చేస్తున్న సర్కారు వారి పాట మూవీ టైటిల్ లోగో అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో మహేష్ రోల్ పై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మహేష్ ఈ చిత్రంలో వడ్డీ వ్యాపారిగా కనిపిస్తాడని, బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలపై సెటైరికల్ మూవీ అని… అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా మహేష్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తుంది. ,మొదటి నుండి గతంలో మహేష్ భరత్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అద్వానీ పేరు వినిపిస్తుంది. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. దబంగ్ 3 మూవీలో సల్మాన్ కి జంటగా చేసిన సాయి మంజ్రేకర్ ని తీసుకోవాలని దర్శక నిర్మాతలు ప్లాన్ లో ఉన్నారట. మరి అదే కనుక జరిగితే ఆమెకు బంపర్ ఛాన్స్ దక్కినట్లే.

సంబంధిత సమాచారం :

More