“ఆచార్య”లో ఇలాంటి మెగా సీన్ కూడా ఉందా?

“ఆచార్య”లో ఇలాంటి మెగా సీన్ కూడా ఉందా?

Published on May 20, 2020 12:03 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై గత కొన్ని రోజుల కితం వరకు కొన్ని క్రేజీ రూమర్స్ పెను సంచలనం రేపాయి.

ఈ చిత్రంలో చిరుతో పాటు ఓ కీలక రోల్ లో మరో స్టార్ హీరో కనపడతారని తెలియగా దానికి గాను సూపర్ స్టార్ మహేష్ మరియు మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఆ తర్వాత ఆ రోల్ లో కనిపించబోయేది రామ్ చరణే అని కొరటాల కన్ఫర్మ్ చేసేసారు. దానితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

అయితే ఈ చిత్రంపై వస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం చిరు మరియు చరణ్ లకు నడుమ ఓ మెగా సీన్ ఉండబోతుంది అని, అది ఓ మెగా యాక్షన్ సీన్ అయినా ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి సందర్భంలో ఈ సీన్ ఉంటుందో కానీ మంచి థ్రిల్లింగ్ యాక్షన్ సీన్ వీరి నడుమ ఉండబోతుంది అని ఓ క్రేజీ రూమర్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ పేరు వినిపిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు