తన ‘తిక్క’ చూపిస్తానంటున్న సాయిధరమ్ తేజ్

తన ‘తిక్క’ చూపిస్తానంటున్న సాయిధరమ్ తేజ్

Published on Jul 31, 2015 1:26 PM IST

thikka
‘రేయ్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నా ఈ సినిమాని సేప్తేమబ్ర్ 24న రిలేజే చేయనున్నారు. ఇది కాకుండా సాయి ధరమ్ తేజ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకదానికి పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకుడైతే, మరొకదానికి ఓం ఫేం సునీల్ రెడ్డి దర్శకుడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఈ రోజు అధికారికంగా ప్రారంభమైంది.

సునీల్ రెడ్డి ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్ టైటిల్ ని పెట్టాడు. సాయి ధరమ్ తేజ్ 4వ సినిమాకి ‘తిక్క’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. అలాగే సినిమాకి ‘హ్యాండిల్ విత్ కేర్’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. నేటి నేడు ప్రారంభమైన ఈ సినిమా రెగ్యుల షూటింగ్ కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లుక్ పరంగా టోటల్ డిఫరెంట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని శ్రీలంకలో షూట్ చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని సి. రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందించనున్నాడు.

తాజా వార్తలు