‘వీర సింహారెడ్డి’ లాస్ట్ సాంగ్ పై క్రేజీ అప్ డేట్ !

‘వీర సింహారెడ్డి’ లాస్ట్ సాంగ్ పై క్రేజీ అప్ డేట్ !

Published on Dec 19, 2022 12:04 AM IST


బాలయ్య బాబు హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న ‘వీర సింహారెడ్డి’ సినిమా లాస్ట్ సాంగ్ షూటింగ్ గురించి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఈ నెల 21న బాలయ్య – శ్రుతి హాసన్ ల పై అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వలో ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. ఇక ఈ సినిమా ఇంటర్వెల్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

ఈ సినిమా ఇంటర్వెల్ దగ్గరే బాలయ్య – శ్రుతి హాసన్ క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని.. సినిమా మొత్తంలోనే ఈ ట్విస్ట్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. పైగా సినిమాకే మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటో చూడాలి. కాగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని, మరి వీర సింహా రెడ్డి తో.. ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమా పై అయితే మంచి అంచనాలు ఉన్నాయి. పైగా అఖండ లాంటి భారీ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు