‘ప్రాజెక్ట్-కె’ పై కొత్త రూమర్ ?

‘ప్రాజెక్ట్-కె’ పై కొత్త రూమర్ ?

Published on Jul 16, 2023 7:02 PM IST

Project K

నేషనల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘ప్రాజెక్ట్‌ కె’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మరో అతిధి పాత్ర ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ అతిధి పాత్రలో కూడా ఓ ప్రముఖ హీరో కనిపించబోతునట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు.

ఇంతకీ ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలో కనిపించబోతున్న ఆ అతిధి ఎవరో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా 90% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కూడా కొన్ని వారాల్లో పూర్తి చేయబడుతుంది. మరోపక్క ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఏకకాలంలో జరుగుతోంది. టీమ్ పెట్టుకున్న టైమ్‌ లైన్ ప్రకారం, విఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్ మరియు డిఐ తో సహా మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అక్టోబర్‌లో పూర్తి కానున్నాయి. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు