లవ్ స్టోరీతో వస్తోన్న క్రియేటివ్ డైరెక్టర్ ?

Published on Sep 25, 2018 8:34 am IST

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ల్లో ‘కృష్ణ వంశీ’ పేరు ముందు వరసలో ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడికి ఇప్పుడు కొత్త వాళ్ళతో కొత్త ప్రేమకథలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఏమైనా కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రేమ కథా చిత్రాలు తియ్యడంలో కృష్ణ వంశీ’ శైలే వేరు. ఆర్టిస్ట్ ల నుంచి నటనను రాబట్టడంలో గాని, మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకోవడంలో గాని ఆయనకు మంచి అభిరుచే ఉంది. కాగా కృష్ణ వంశీ కొన్ని నెలలుగా ఓ ప్రేమ కథ పై వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ చిత్రానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆ ప్రేమ కథ ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఈ ప్రేమకథను కొత్తవాళ్లతోనే తీయాలని కృష్ణవంశీ నిర్ణయించుకున్నారు. తాజాగా తన కథలోని క్యారెక్టర్స్ కి సూట్ అయ్యే ఆ కొత్త వాళ్ళను వెతికే పనిలో ఉన్నాడట ఈ దర్శకుడు. ఈ ప్రేమ కథతో మళ్ళీ కృష్ణ వంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

సంబంధిత సమాచారం :