నటుడిగా మారనున్న స్టార్ క్రికెటర్…!

Published on Jun 29, 2019 4:08 pm IST

వెస్టిండీస్ అల్ రౌండర్ డ్వేన్ బ్రావో నటుడిగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఆయన ఓ షార్ట్ ఫిల్మ్లో ఓ పాత్రలో నటించడానికి ఒప్పుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఓ సామజిక అవగాహనకు సంబంధించిన అంశంపై తెరకెక్కనున్న ఓ షార్ట్ ఫిలింలో నటించడానికి బ్రేవోని సంప్రదించగా ఆయన ఇందుకు సుముఖత తెలిపారు. వివేక్ కూచిబొట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ షార్ట్ ఫిలిం కి నటరాజ్ పిళ్ళై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐతే సాంకేతిక వర్గం,ఇతర నటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

మైదానంలో విభిన్నమైన హావభవాలతో మెప్పించే బ్రావో నటుడిగా ఎలా అలరిస్తాడో చూడాలి మరి. మరో వైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన విరాట్ కలిసి రోడ్డు ప్రమాదాలకు సంబందించిన ఒక అవగాహనా వీడియో కొరకు కలిసి నటించనున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More