బన్నీ పాన్ ఇండియా స్టార్…ఇదే ప్రూఫ్..!

Published on Apr 8, 2020 8:00 pm IST

టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ కి ఇతర రాష్ట్రాలలో కూడా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయనకు మాలీవుడ్ లో తెలుగులో సమానమైన ఇమేజ్ అతని సొంతం. అందుకే బన్నీ సినిమాలు తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల అవుతూ ఉంటాయి. ఇక బాలీవుడ్ సెలెబ్రటీలలో కూడా బన్నీకి గుర్తింపు ఉంది. కాగా ఇండియన్ క్రికెటర్ ఒకరు బన్నీకి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. మీరు నా అభిమాన హీరో అని ట్విట్టర్ సందేశం పంపారు.

టీమిండియా క్రికెటర్ రాహుల్ శర్మ అల్లు అర్జున్ కు విషెస్ తెలుపుతూ.. మీ సినిమాలన్నీ సోనీ మ్యాక్స్ లో చూస్తాను మీరు నా ఫేవరేట్ అని ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా బన్నీ థాంక్యూ వెరీ మచ్ అని రిప్లై ఇచ్చాడు. దీనితో బన్నీకి ఫ్యాన్ ఇండియా ఇమేజ్ ఉందన్న విషయం అర్థం అవుతుంది. ఇక బన్నీ లేటెస్ట్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More