చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్.

Published on May 21, 2020 10:30 am IST

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వలన టాలీవుడ్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు స్థంబించిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ పూర్తిగా మూతపడింది. కాగా కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గకున్నప్పటికీ ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నాయి. నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కార్యకలాపాలపై నేడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో చర్చ జరగనుంది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్ మోహన్ రావు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు.

ఇక సినిమా షూటింగ్స్ పునః ప్రారంభం, థియేటర్స్, సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కరోనా బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ తరువాత టాలీవుడ్ భవిష్యత్ కార్యాచరణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోగా, పూర్తి అయిన సినిమాల విడుదల ఆగిపోయింది. దీనివలన ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది ఉపాధి కోల్పోతున్నారు. కావున ఈ మీటింగ్ పై చిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం :

X
More