“వకీల్ సాబ్” రీఎంట్రీ పై నెలకొన్న ఆసక్తి.!

Published on Jun 16, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ సాలిడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ గత ఏప్రిల్ నెలలో విడుదల అయ్యింది. అలా అయ్యి పట్టుమని 20 రోజులు కూడా థియేటర్స్ లో నిలవలేదు. కరోనా రెండో వేవ్ మూలాన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడేసి వసూళ్లు రాబట్టేసింది.

అయితే మరి నిన్నటి నుంచి మళ్ళీ థియేటర్స్ లో వకీలోడి ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో వార్తలు ఊపందుకోగా మరోపక్క పవన్ అభిమానుల్లో కూడా మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు మొత్తం 300 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని రీరిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ రాగా అసలు ఈ చిత్రం ఒక్క తెలంగాణలోనే విడుదల అవుతుందా అన్న కొత్త ప్రశ్న వచ్చింది.

వచ్చే జూలై 1 నుంచి తెలంగాణలో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకుంటుండగా ఇంకా ఏపీలో థియేటర్స్ తెరిచివేతపై క్లారిటీ లేకపోవడంతో వకీల్ సాబ్ ఎంట్రీ మళ్ళీ ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఓటిటిలో కూడా ఈ చిత్రం వచ్చేసింది.. మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :