క్లైమాక్స్ చిత్రీకరణలో ‘కరెంట్ తీగ’..!

క్లైమాక్స్ చిత్రీకరణలో ‘కరెంట్ తీగ’..!

Published on Jul 29, 2014 11:48 AM IST

Current-Teega

మంచు మనోజ్ నటిస్తున్న తాజా సినిమా ‘కరెంట్ తీగ’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మనోజ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకు జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. మంచు విష్ణు నిర్మాత. సన్నీ లియోన్ ప్రత్యెక పాత్రలో నటిస్తుంది.

క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణతో దాదాపు టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. మిగతా సాంగ్స్ షూటింగ్ బాలన్స్ ఉంది. అచ్చు సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు