అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్ పై కేసు.!

Published on Aug 14, 2020 8:42 pm IST


అప్పటి వరకు ఓ సాధారణ సినీ విమర్శకుని గానే చలామణి అయ్యిన కత్తి మహేష్ గత కొన్నాళ్ల కితం తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అనంతరం టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.

ఇక అక్కడ నుంచి అతను ఏం మాట్లాడినా సరే అది సంచలనంగా మారడం మొదలయ్యింది. ఆ తర్వాత కూడా పలు అంశాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ సినీ మరియు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.

తాజాగా కత్తి మహేష్ శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు గానూ అతనిపై కేసు నమోదు అయ్యినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 -1బి మరియు 505 -2 సెక్షన్లలో కేసులు నమోదు చేసారు. దీనితో ఇప్పుడు కత్తి మహేష్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

సంబంధిత సమాచారం :

More