ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాని ఎంతగా వాడుతున్నారన్న విషయం పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం పలు రకాల వీడియో సందేశాలను, మీమ్‌లను పోస్టు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా నేడు RRR సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్‌ను కూడా వాడేసుకున్నారు.
నేడు RRR చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ బైక్‌పై కూర్చుని వెళుతున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే ఆ ఫోటో ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పూనుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతున్న ఎన్టీఆర్‌కు, వెనుక కూర్చున్న రామ్‌చరణ్‌కు గ్రాఫిక్స్ ద్వారా హెల్మెట్ జోడించి, ఇప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. ‘హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ప్రయాణించండి’ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీనికి RRR టీమ్ కూడా స్పందిస్తూ ‘ఇప్పటికీ పర్‌ఫెక్ట్‌గా లేదు.. నంబర్ ప్లేట్ మిస్సయింది’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మార్ఫింగ్ ఫోటో వైరల్‌గా మారింది.
Now it is perfect.
Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021