చుల్ బుల్ పాండే 3.0 కూడా వచ్చేస్తున్నాడు

Published on Aug 21, 2019 1:26 pm IST

సల్మాన్ ఖాన్ హీరోగా 2010లో వచ్చిన దబాంగ్ సంచలన విజయం నమోదు చేసింది. దర్శకుడు అభినవ్ కశ్యప్ సల్మాన్ ని చుల్ బుల్ పాండే అనే ఓ వైవిధ్యమైన పోలీస్ పాత్రలో చూపించి తన ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు. ఈ చిత్రంతోనే హీరోయిన్ సోనాక్షి సిన్హా వెండి తెరకు పరిచయమయ్యారు. కాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా దబాంగ్ 2 కూడా విడుదల కావడం జరిగింది.

ఐతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న దబాంగ్ 3 విడుదల తేదీని ప్రకటించేశారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్
20న హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ బాషలలో కూడా విడుదల కానుంది.గతంలో ప్రభుదేవా,సల్మాన్ తెలుగు పోకిరి మూవీ హిందీ రీమేక్ వాంటెడ్ చిత్రం కొరకు కలిసిపనిచేశారు. దబాంగ్ 3 లోకూడా సోనాక్షి వరుసగా మూడో సారి సల్మాన్ తో కలిసి నటిస్తుంది.

సంబంధిత సమాచారం :