సినిమా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ సొంతం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం మరో ఎత్తు. ఇప్పుడు ‘డాకాయిట్’ మూవీ సరిగ్గా ఇదే చేస్తోంది. అంచనాలకు మించి ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మొత్తం రూ.65 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే థియేటర్లలోకి రాకముందే మేకర్స్ చాలా వరకు సేఫ్ అయ్యారు. ఓటీటీ, శాటిలైట్, ఆడియో తదితర హక్కుల రూపంలోనే దాదాపు రూ.48 కోట్లు వెనక్కి వచ్చేశాయి. అంటే, థియేట్రికల్ రన్ ద్వారా కేవలం రూ.17 కోట్లు వస్తే చాలు.. సినిమా ప్రాఫిట్ జోన్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది.
అడివి శేష్ ఫామ్ కంటిన్యూ..
ఇలాంటి టార్గెట్‌తో బరిలోకి దిగిన డాకాయిట్, మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా కేవలం మూడే రోజుల్లో రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆశించిన దానికంటే చాలా వేగంగా రూ.17 కోట్ల మార్క్‌ను దాటేసి అడివి శేష్ ఫామ్‌ను నిలబెట్టింది.
వీకెండ్ పూర్తయినా థియేటర్ల దగ్గర సందడి ఏమాత్రం తగ్గలేదు. ట్రేడ్ లెక్కల ప్రకారం బయ్యర్లు ఇంకా పూర్తిగా సేఫ్ కాలేదు. కానీ, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జోరు చూస్తుంటే మాత్రం.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ దాటేసి, సినిమా కొన్న బయ్యర్లకు కూడా మంచి లాభాలు రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
