టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతోంది. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ శేష్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. మొదటి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో అడివి శేష్ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అత్యంత వేగంగా హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో, మొదటి రోజు ముగిసేసరికి అక్కడ 575K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీ వెర్షన్‌లో కూడా సినిమా ఆకట్టుకుంటూ తొలిరోజే రూ.1.25 కోట్ల వసూళ్లను సాధించడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. మార్నింగ్ షోల కంటే మ్యాట్నీ షోలకు డబుల్ ఆక్యుపెన్సీ నమోదు కాగా, సాయంత్రం షోలకు బుకింగ్స్ మరింత పెరిగాయి. ‘బుక్ మై షో’లో ఏకంగా 2.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. కంటెంట్ ఉన్న చిత్రాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ వచ్చిన అడివి శేష్, ‘డెకాయిట్’ సినిమాతో ఇప్పుడు మాస్ ఆడియన్స్‌ను కూడా తనవైపు తిప్పుకుని నెక్స్ట్ లెవల్‌కు చేరుకున్నాడు. తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ మూవీ సాలిడ్ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.



