దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ సౌత్ 2019 అవార్డ్స్ – బెస్ట్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్.

Published on Sep 21, 2019 8:30 am IST

2019 దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ సౌత్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది.ఈ ఏడాదికి గాను బెస్ట్ యాక్టర్ గా మహేష్, బాబు బెస్ట్ యాక్ట్రెస్ గా అనుష్క శెట్టి ఎంపిక కావడం విశేషం. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సోషల్ ఓరియెంటెడ్ అండ్ కమర్షియల్ మూవీ అయిన భరత్ అను నేను చిత్రంలో మహేష్ నటనకు గాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు.మహేష్ ఈ చిత్రంలో మొదటిసారి సీఎం పాత్రలో మెప్పించారు. ఇక స్వీటి అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరిలో భాగమతి చిత్రానికి గాను,అవార్డు అందుకున్నారు. జి అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ భాగమతి చిత్రంలో అనుష్క రెండు విభిన్న పాత్రలలో అలరించారు.

ఇక కీర్తి సురేష్ కి మహానటి మూవీ ఇంకో అవార్డు తెచ్చిపెట్టింది. అవుట్ స్టాండిన్ పెర్పార్మెన్సు కేటగిరీలో కీర్తి సురేష్ మహానటి చిత్రానికి అవార్డు అందుకున్నారు. ఇక కన్నడ సెన్సేషన్ యష్ కెజిఎఫ్ చిత్రానికి గాను ఇదే కేటగిరీలో అవార్డు అందుకోవడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More