ఆ కారు ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన దగ్గుబాటి కుటుంబం.!

Published on Aug 13, 2020 1:55 pm IST

ఇటీవలే మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి వివాహంతో దగ్గుబాటి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉన్న తరుణంలో అకస్మాత్తుగా వారి కుటుంబానికి చెందిన దగ్గుబాటి అభిరాం పై వైరల్ అవుతున్న ఓ వార్త వారిని విషమయానికి గురి చేసింది. ఇక అసలు విషయానికి వచ్చినట్టయితే..

రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో ద‌గ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌నీ, ఎదురుగా వ‌స్తున్న కారును ఆయ‌న కారు ఢీకొట్టింద‌నీ మీడియాలో మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు ప్రచారం కావడంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారట.

దీనితో ఈ వార్తలన్నిటినీ ఖండించి అసలు ఈ ప్రమాదానికి మరియు దగ్గుబాటి అభిరామ్ కు సంబంధం లేదని కేవ‌లం అది అంతా వదంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని వారు కోరారు.

సంబంధిత సమాచారం :

More