‘హోరా హోరీ’తో మెప్పించేందుకు సిద్ధమైన దక్ష!

‘హోరా హోరీ’తో మెప్పించేందుకు సిద్ధమైన దక్ష!

Published on Sep 9, 2015 7:12 PM IST

hora-hori
గతంలో అంతా కొత్తవాళ్ళతోనే సినిమాలు తీసి కూడా పలు బ్లాక్‌బస్టర్ విజయాలను నమోదు చేసిన దర్శకుడు తేజ, మళ్ళీ కొత్తవాళ్ళని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ రూపొందించిన సినిమాయే ‘హోరా హోరీ’. కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో దిలీప్-దక్షలు హీరో హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదలకు సిద్ధమైంది. తేజ ఈజ్ బ్యాక్ అన్న ప్రచారంతో మనముందుకు వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక గతంలో తేజ సినిమాల ద్వారా పరిశ్రమకు పరిచయమై నేడు స్టార్స్‌గా వెలుగొందుతోన్న వారికి తేజ సినిమా ఎలా ఉపయోగపడిందో, తనకూ ‘హోరా హోరీ’ ఆ క్రేజ్‌ను తెస్తుందని హీరోయిన్ దక్ష భావిస్తున్నారు. ముంబైకి చెందిన ఈ హీరోయిన్, ఈ సినిమాలో ఓ బలమైన పాత్రలో నటించానని చెప్పుకొస్తూ హోరా హోరీ తనకు మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దక్ష స్వయంగా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం విశేషంగా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు