త్వరలో విడుదలవుతున్న కింగ్ అక్కినేని నాగార్జున ‘డమరుకం’ సినిమా ఒకరోజు ఆలస్యంగా విడుదల కాబోతుంది. మొదటగా ఈ సినిమాని అక్టోబర్ 11న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. కాని ఒకరోజు ఆలస్యంగా అక్టోబర్ 12న విడుదల కాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొదటగా అనుకున్న తేదీకి కాకుండా ఒక రోజు ఎందుకు ఆలస్యంగా విడుదలవుతుంది అన్న విషయాల్లోకి వెళితే, డమరుకం సినిమాని మొదటగా అనుకున్న అక్టోబర్ 11న అయితే గురువారం విడుదల చేసి వారాంతపు వసూళ్లు సొమ్ము చేసుకోవాలని సన్నాహాలు చేసారు. అయితే సాధారణంగా దాదాపు ప్రతి సినిమా శుక్రవారం విడుదల చేసే సంప్రదాయం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. డమరుకంతో పాటుగా సూర్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్న మరో డబ్బింగ్ సినిమా బ్రదర్స్ కూడా అదే రోజు విడుదలవుతుంది. పేరుకే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో సూర్యకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా డమరుకంకి పోటీగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
డమరుకం ఒకరోజు ఆలస్యంగా ఎందుకు విడుదలవుతుంది?
డమరుకం ఒకరోజు ఆలస్యంగా ఎందుకు విడుదలవుతుంది?
Published on Oct 4, 2012 8:13 AM IST
సంబంధిత సమాచారం
- ‘బైకర్’ పై ‘పెద్ది’ ప్రశంసలు! యూనిక్ అటెంప్ట్ అంటూ..
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- తన గ్లామ్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘డెకాయిట్’ బ్యూటీ!
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్
- ‘పెద్ది’ నైజాం రైట్స్ కి భారీ మొత్తం ?
- ‘రామాయణ’ పై విమర్శలకు హృతిక్ జవాబు !
- ‘రుద్ర – మందాకిని’ల సీన్స్ పై రాజమౌళి ఫోకస్
- ‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్ కోసం కసరత్తులు !
- బాలయ్య పై సాంగ్ ను ప్లాన్ చేస్తున్న గోపీచంద్ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : బైకర్ – రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్, రాజశేఖర్ల ఎమోషనల్ రైడ్
- సమీక్ష: రాకాస – డీసెంట్ గా సాగే కామెడీ హారర్ డ్రామా
- ట్రెండ్ సెట్ చేస్తున్న సూర్య.. ‘వీరభద్రుడు’గా మారిన కరుప్పు..!
- ట్రైలర్ టాక్ : ప్రేమ, నమ్మకద్రోహం, విధ్వంసం.. ‘డెకాయిట్’ సాలిడ్ ట్రీట్ ఖాయం..!
- ‘జైలర్ 2’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తలైవా..!
- సమీక్ష : లీడర్ – రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ !
- ఫోటోలు : ముంబైలో ‘డెకాయిట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్
- మణిరత్నం సినిమాలో సాయి పల్లవి, విజయ్ సేతుపతి.. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అంటే..?


