ఆడియో విడుదలకు సిద్దం అవుతున్న ‘దండుపాళ్యం 3’ !
Published on Feb 20, 2018 1:15 pm IST

వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన దండుపాళ్యం పార్ట్ 1, 2 విడుదలై సక్సెస్ అయ్యాయి. తాజాగా ‘దండుపాళ్యం 3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 25న విడుదల కాబోతోంది. ‘తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ‘దండుపాళ్యం 3’ పై మంచి క్రేజ్ ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 % షూటింగ్ ని పూర్తి చేసారు. ఈ చిత్రాన్ని తెలుగు , కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

 
Like us on Facebook