మజిలీ రీమేక్ లో స్టార్ హీరో ?

Published on Apr 18, 2019 12:15 pm IST

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య , సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్ లో బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

ఇక ఈ చిత్రం కోలీవుడ్ లో రీమేక్ కానుంది. తమిళ మీడియా కథనం ప్రకారం ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను స్టార్ హీరో ధనుష్ సొంత బ్యానర్ వుండర్బర్ ఫిలిమ్స్ సొంతం చేసుకుందట. మరి ఈ రీమేక్ లో ధనుష్ హీరోగా నటిస్తాడో లేదో వేరే హీరోతో రీమేక్ చేస్తాడో చూడాలి. ఇక ప్రస్తుతం ధనుష్, అసురన్ చిత్రంలో నటిస్తూ బిజీగా వున్నాడు.

సంబంధిత సమాచారం :