“దసరా బుల్లోళ్లు”.. ఈ సారి పండగ దద్దరిల్లడం ఖాయం..!

Published on Oct 7, 2021 12:19 am IST


పండగలు, పర్వదినాలు ప్రత్యేకం ఏదైనా, విశేషం ఎప్పుడున్నా ఎప్పటికప్పుడు సరికొత్త శైలిలో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తున్న ఈటీవీ ఈ సారి దసరాకు కూడా ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్ అందించేందుకు రెడీ అయ్యింది. ‘దసరా బుల్లోళ్లు’ అనే కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో చూస్తుంటే పండగ దద్దరిల్లడం ఖాయంగా అనిపిస్తుంది.

ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, గంగవ్వ, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ మొదట్లో వచ్చే సాకీని పాడిన జానపద గాయకుడు మొగులయ్య వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఏదో విలేజ్‌లో కూడా కొన్ని సీన్స్ తీసినట్టు తెలుస్తుంది. మరీ ఈ ఎంటర్‌టైన్మెంట్‌ని మిస్ కాకూడదంటే ఈ దసరా రోజు ఉదయం 9:00 గంటలకు ఈటీవీలో వచ్చే “దసరా బుల్లోళ్లు” కార్యక్రమాన్ని తప్పక చూడాల్సిందే .

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :