షూటింగ్ పూర్తి చేసుకున్న డాషింగ్ డైరెక్టర్ సినిమా !
Published on Feb 18, 2018 4:56 pm IST

పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తోన్న ‘మెహబూబా’ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ హీరోగా పరిచయం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈరోజు ఉదయం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్ లో ప్రారంభం అయ్యాయి. 1971 నాటి ఇండియా – పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది.

సినిమా దాదాపు చిత్రీకరణ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్, రాజస్థాన్ జరిగింది. సందీప్ చౌతా సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మద్య విడుదలైన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. పూరి జనన్నాద్ ఈ సినిమాతో మళ్ళి ఫాంలోకి వస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో మెహబూబా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 
Like us on Facebook