అవైటెడ్ “అవతార్ 2” ట్రైలర్ కి డేట్ లాక్ అయ్యిందా?

అవైటెడ్ “అవతార్ 2” ట్రైలర్ కి డేట్ లాక్ అయ్యిందా?

Published on Oct 30, 2022 10:00 AM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుని ఆడియెన్స్ ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “అవతార్ 2”. దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ అవతార్ కి సీక్వెల్ గా దాదాపు దశాబ్ద కాలం తర్వాత వస్తున్న ఈ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్” గా వస్తుంది.

మరి ఈ చిత్రంపై అయితే ఎనలేని హైప్ ఉండగా సినిమా విడుదల కూడా దగ్గర పడుతుండడంతో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ అవైటెడ్ ట్రైలర్ ని ఈ వచ్చే వారం నవంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టుగా బజ్ మొదలైంది.

మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్రెడీ అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 120 భాషలకి పైగా డిసెంబర్ 16న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు