లేటెస్ట్..చరణ్ మరో బిగ్ ప్రాజెక్ట్ కి డేట్ ఖరారు?

Published on Aug 26, 2021 1:30 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటి తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తాడా అన్న సంశయంలో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా విపరీతమైన అంచనాలు పెరిగాయి.

దీనితో అక్కడ నుంచి ఈ సెన్సేషనల్ కాంబో ఎప్పుడు నుంచి స్టార్ట్ కానుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పలు వాయిదాలు అడ్డంకులు నడుమ ఈ చిత్రం తెరకెక్కించడానికి శంకర్ కి లైన్ క్లియర్ అయ్యింది. అయితే ఇప్పుడు పలు పనులను శరవేగంగా కంప్లీట్ చేస్తున్న శంకర్ ఈ చిత్రాన్ని ఏ డేట్ నుంచి అధికారికంగా షురూ చేయనున్నారో తెలుస్తుంది.

వచ్చే సెప్టెంబర్ 8 న ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు నుంచి రెగ్యులర్ షూట్ మోడ్ లోకి వెళ్లనున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :