మాస్ మహారాజ్ క్రేజీ ప్రాజెక్ట్ షూట్ కి డేట్ ఫిక్స్.!

Published on Jun 27, 2021 3:04 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ లాస్ట్ చిత్రం “క్రాక్” తో అదిరే హిట్ కొట్టారు. దాని తర్వాత ఇక మాస్ స్పీడ్ తో వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి వాటి షూటింగ్స్ లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. మరి అలా దర్శకుడు రమేష్ వర్మతో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఖిలాడి” కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోవచ్చింది.

మరి ఇప్పటి వరకు టాలీవుడ్ కి ఎందరో కొత్త దర్శకులని పరిచయం చేసిన మాస్ మహారాజ్ నుంచి ఓ కాంబోపై మంచి అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ లో పలు సాలిడ్ అసిస్టెంట్ దర్శకునిగా పని చేసిన శరత్ మందవను దర్శకుడిగా పని చేస్తూ రవితేజ సినిమా ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కి కూడా ముహూర్తం కన్ఫర్మ్ అయ్యిపోయింది.

మేకర్స్ ఈ చిత్రంను వచ్చే జూలై 1 నుంచి స్టార్ట్ చెయ్యాలని టైం ఫిక్స్ చేశారు. మరి అలాగే ఇప్పటికే ఈ దర్శకుడు మళ్ళీ వింటేజ్ రవితేజని చూపిస్తా అని చెప్తూ ప్రతి ఒక్క యాస్పెక్ట్ కూడా ఈ చిత్రంలో యూనిక్ గా ఉంటుందని తెలిపాడు. అలాగే ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :