ధనుష్ ‘ఓం’ నుంచి బిగ్ రివీల్ కి డేట్ ఫిక్స్.. కానీ

ధనుష్ ‘ఓం’ నుంచి బిగ్ రివీల్ కి డేట్ ఫిక్స్.. కానీ

Published on Sep 5, 2026 11:36 PM IST

తమిళ వెర్సటైల్ స్టార్ హీరో ధనుష్ నుంచి ఈ ఏడాది రిలీజ్ కి ఫిక్స్ చేసిన మరో చిత్రమే ‘ఓం’. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాలో అనేకమంది స్టార్ నటీనటులు ఉన్నారు. మరి వారిలో మోలీవుడ్ స్టార్ నటుడు మమ్ముట్టి కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తనపై బిగ్ రివీల్ కి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సెప్టెంబర్ 7న మమ్ముట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడదుల చేస్తున్నట్లు ఓ ప్రీ లుక్ పోస్టర్ ని వదిలి ఆసక్తి రేకెత్తించారు.

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ మరోసారి రిలీజ్ డేట్ ని మేకర్స్ మిస్ చేసారు. మొదట అక్టోబర్ 16న విడుదల తేదీని ఫిక్స్ చేసి జైలర్ 2 తో క్లాష్ కి సిద్ధం చేసారు. కానీ ఆ తర్వాత రిలీజ్ డేట్ ని అప్డేట్స్ లో మిస్ చేస్తూ వస్తుండడంతో మేకర్స్ సస్పెన్స్ మైంటైన్ చేసారు. ఇక తాజా అప్డేట్ లో కూడా విడుదల తేది లేకపోవడంతో సినిమా వాయిదా ఖరారు అనుకోవచ్చు. మరి కొత్త డేట్ ని మమ్ముట్టి పోస్టర్ తోనే రివీల్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ధనుష్ నిర్మాణం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు