మలయాళ యంగ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ థ్రిల్లర్ చిత్రాల్లో గ్యాంబ్లింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘ఐయామ్ గేమ్’ కూడా ఒకటి. డీసెంట్ బజ్ ఉన్న ఈ సినిమాని మేకర్స్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రెజెంట్ చేస్తూ వస్తున్నారు.
ఇలా మేకర్స్ సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. దుల్కర్ ఫస్ట్ బెత అంటూ ఈ జూలై 28 డేట్ ని లాక్ చేశారు. దుల్కర్ పై పార్టీ మోడ్ లో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఇక ఈ రానున్న గ్లింప్స్ లేదా టీజర్ తో సినిమాపై కొంచెం క్లారిటీ ఆడియెన్స్ కి రావచ్చు.
ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన కయాదు లోహర్, సంయుక్త ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా కాతిర్, శాండీ మాస్టర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దుల్కర్ నిర్మాణం వహించాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం ఈ ఆగస్ట్ 20న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.


