‘కింగ్‌డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేస్తోంది!

‘కింగ్‌డమ్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేస్తోంది!

Published on Apr 28, 2025 5:27 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె రైల్వే స్టేషన్‌లోని ఓ బెంచ్‌పై కూర్చున్నట్లు చూపెట్టారు. అయితే వారి ముఖాలు మాత్రం ఇందులో రివీల్ చేయలేదు.

ఈ సాంగ్‌ను అనిరుధ్ రవిచందర్ అద్భుతంగా కంపోజ్ చేశాడని.. ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని విజయ్ దేవరకొండ అన్నారు. ఇక ఈ సినిమాను మే 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు