‘మహానటి’ ఆడియో విడుదల తేదీ ఖరారు !
Published on Apr 26, 2018 11:17 am IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మహానటి’. మొదటి నుండి విడుదలైన పోస్టర్లు, ఇటీవలే వచ్చిన టీజర్, మూగ మనసులు పాట అన్నీ కలిసి సినిమాపై ప్రేక్షకుల్లో బోలెడంత ఆసక్తిని క్రియేట్ చేశాయి. మే 9వ తేదీన ఈ చిత్రం విడుదలకానుండగా మే 1న ఘనంగా ఆడియో వేడుక నిర్వహించనున్నారు నిర్మాతలు.

ఈ చిత్ర ఆడియోలో రెండవ పాట ‘సదా నన్ను’ ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, నాగ చైతన్య వంటి స్టార్ నటీ నటుల నటించారు. ఇకపోతే వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook