భారీ కలెక్షన్లతో దిగ్విజయంగా నడుస్తున్న ‘రంగస్థలం’ చిత్రం హీరో రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు భారీ సక్సెస్ ను అందించింది. ముఖ్యంగా చరణ్ అయితే ఈ విజయం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈ సక్సెస్ ను ఈవెంట్ రూపంలో సెలబ్రేట్ చేసుకోనున్నారు టీమ్.
ఈ నెల 12న ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ హైదరాబాలోని నోవాటెల్ హోటల్లో ఘనంగా జరగనుంది. ముందుగా ఈ వేడుకను అమరావతిలో చేస్తారని వార్తలొచ్చినా ఇప్పుడు హైదారబాద్లోనే చేస్తారని క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ‘సైరా’ షూటింగ్లో బిజీగా ఉండటం వలన చిరంజీవిగారు ఈ వేడుకకు హాజరుకావడంలేదని తెలుస్తోంది.


