కొరియన్ కనకరాజు మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..?

కొరియన్ కనకరాజు మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..?

Published on Jul 16, 2026 9:49 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డే్ట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా నుండి తాజాగా క్రేజీ మ్యూజికల్ అప్‌డేట్ వచ్చింది. రాయలసీమ మాస్ బీట్స్‌తో సాగే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘రాస గుమ్మడి’ని జూలై 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మాస్ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాలో దక్షా నగార్కర్, రితికా నాయక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం, 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు