క్రేజీ అప్డేట్ : ‘వకీల్ సాబ్’ ట్రైలర్ డేట్

Published on Mar 24, 2021 5:33 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘వకీల్ సాబ్’. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడింది. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానుంది. గట్టిగా 15 రోజులు మాత్రమే ఉండటంతో నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. టీవీ ప్రమోషన్లు, భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అలాగే ట్రైలర్ ను రెడీ చేశారు. ఈ నెల 29వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నారు.

ఇందులో పవన్ పాత్రను పూర్తిగా రివీల్ చేయనున్నారు. మంచి పవర్ఫుల్ డైలాగ్స్, ఫైట్స్, కోర్ట్ సీన్స్ లాంటివి టచ్ చేస్తారట. మొత్తంగా సినిమా మీద ఒక అంచనా వచ్చేలా ట్రైలర్ ఉంటుందని అంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా అంజలి, నివేతా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలు చేశారు. ఏప్రిల్ 9వ తేదీన చిత్రం భారీ ఎత్తున విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :