‘వృషకర్మ’ సెకండ్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

‘వృషకర్మ’ సెకండ్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Published on Nov 16, 2026 10:01 PM IST

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’. మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు.

‘అమాయకత్వంతో కూడిన ఒక చిన్న ప్రపంచం, ఎన్నో భావోద్వేగాల సమాహారం’ అంటూ ఈ సినిమాలోని రెండో పాట ‘ఛలో పదవే’ను నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, సాయి విఘ్నేష్ ఆలపించారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా ఖన్నా, స్పర్ష్ శ్రీవాస్తవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు