యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ ను డిసెంబర్ సెకండ్ వీక్ లో షూట్ చేస్తారని, ఇక ఈ సినిమా షూటింగ్‌ను 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్, రవి బస్రూర్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారు.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


