ప్రభాస్ గెటప్ లో బాహుబలి డైలాగ్ చెప్పిన స్టార్ క్రికెటర్ !

ప్రభాస్ గెటప్ లో బాహుబలి డైలాగ్ చెప్పిన స్టార్ క్రికెటర్ !

Published on May 16, 2020 10:05 PM IST

devid warner

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సౌత్ సినిమా మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది.
వరుస సినీ వీడియోలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. ఇటీవలే టిక్ టాక్ లో బుట్టబొమ్మ సాంగ్ కి తన భార్యతో కలిసి డ్యాన్సులు వేసి.. అలాగే మహేష్ డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన వార్నర్, ఇప్పుడు నేషనల్ స్టార్ ప్రభాస్ డైలాగ్ తో కూడా ఆకట్టుకుంటున్నాడు. అమరేంద్ర బాహుబలి అను నేను అంటూ బాహుబలి సినిమాలో ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్‌ ను, వార్నర్ తన శైలిలో చెప్పడంతో పాటు సేమ్ అదే గెటప్ లో కనిపించి, ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. పైగా గెస్ ద మూవీ అని నెటిజన్లకు ఛాలెంజ్ కూడా చేశాడు. తెలుగునాట ఈ డైలాగ్ తెలియని వారు ఎవరు ఉంటారు.

ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు కెప్టెన్‌ గా ఉన్న వార్నర్‌ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం బాగుంది.
ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ ఇలా తెలుగు సాంగ్స్ కి మరియు డైలాగ్స్ కి వరుస వీడియోలు చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఈ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.

https://www.instagram.com/p/CAPtWPGJU8K/

తాజా వార్తలు