ఎన్టీఆర్ కి వార్నర్ బర్త్ డే గిఫ్ట్…దుమ్మురేపాడు..!

ఎన్టీఆర్ కి వార్నర్ బర్త్ డే గిఫ్ట్…దుమ్మురేపాడు..!

Published on May 20, 2020 4:14 PM IST


కొద్దిరోజులుగా ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వరుస టిక్ టాక్ వీడియోలు చేసి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన తెలుగు హీరోలైన అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్ ల డాన్స్ మరియు డైలాగ్ వీడియోలు చేసి సదరు ఫ్యాన్స్ కి మంచి సరదా పంచారు. కాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకొని డేవిడ్ వార్నర్ తన భార్య కాండీస్ వార్నర్ తో ఓ డాన్స్ వీడియో చేశారు.

ఎన్టీఆర్, కొరటాల శివల హిట్ మూవీ జనతా గ్యారేజ్ మూవీలోని పక్కా లోకల్..సాంగ్ కి ఆయన టిక్ టాక్ వీడియో చేయడం జరిగింది. అలాగే ‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు తారక్. మీ పాటను మేము ట్రై చేశాం. కానీ మీ డాన్స్ వావ్ చాలా ఫాస్ట్’ అని ఆయన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ కి ఓ ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ బర్త్ డే విశెష్ చెప్పడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

https://www.instagram.com/p/CAZmL8HJ4xR/?igshid=1hqmwz81ypfcy

సంబంధిత సమాచారం

తాజా వార్తలు