అదరగొడుతున్న”ధమాకా”..డే 4 కూడా సూపర్ స్ట్రాంగ్ గా.!

అదరగొడుతున్న”ధమాకా”..డే 4 కూడా సూపర్ స్ట్రాంగ్ గా.!

Published on Dec 27, 2022 8:00 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా”. బాక్సాఫీస్ దగ్గర రవితేజ కెరీర్ లో మరో ఇంట్రెస్టింగ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం అయితే వసూళ్ల పరంగా కూడా ఎక్కడా తగ్గడం లేదు. మొదటి రోజు కంటే నెక్స్ట్ రెండు రోజులు కూడా మరింత ఎక్కువ రాగా ఇప్పుడు కీలకమైన సోమవారం కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.

మరి ఈ చిత్రం వీక్ డే సోమవారం రిలీజ్ రోజు నాటి రెస్పాన్స్ ని థియేటర్స్ లో అందుకున్నట్టుగా మేకర్స్ చెప్తున్నారు. దీనితో ఈ భారీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కి గాను ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రంకి భీమ్స్ సంగీతం అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. అలాగే లాంగ్ రన్ లో అయితే ఈ చిత్రం ఎంత రాబడుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు