
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ డిఫరెంట్ మూవీస్ అటెంప్ట్ చేసే సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. జూలై 6న ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. అంతే కాకుండా అదే రోజు ఎన్.టి.ఆర్ న్యూ లుక్ తో ఒక రెండు స్టిల్స్ ని కూడా రిలీజ్ చేసారు. ఎన్.టి.ఆర్ న్యూ లుక్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఎన్.టి.ఆర్ కోసం సుకుమార్ సౌత్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ ని రంగంలోకి దింపాడు.
అతనెవరో కాదు చూడటానికి సింపుల్ గా ఉండే టఫ్ స్టెప్స్ తో ఆకట్టుకునే రాజు సుందరం. ఇప్పటికే రాజు సుందరం కంపోజ్ చేయనున్న సాంగ్ రికార్డింగ్ పూర్తయ్యింది. ఆ సాంగ్ కి ప్రస్తుతం రాజు సుందరం స్టెప్స్ డిజైన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సాంగ్ ని లండన్ లో షూట్ చేయనున్నారు. గతంలో ఎన్.టి.ఆర్ – రాజు సుందరం కాంబినేషన్ లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసేలా ఈ సాంగ్ ని పిక్చరైజ్ చేయనున్నట్లు సమాచారం.
ఫస్ట్ షెడ్యూల్ లో మొదటగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఎన్.టి.ఆర్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తారు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. రకుల్ ప్రీత్ కూడా జూలై 6 నుంచే షూటింగ్ లో పాల్గొంటోంది. జూలై 6 నుంచి మొదలయ్యే షెడ్యూల్ ని కంటిన్యూగా సెప్టెంబర్ 15 వరకూ చేయడానికి ప్లాన్ చేసారు. అలాగే 2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఈ చిత్ర వర్గాలు తెలిపారు. ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

