ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న థియేటర్లలోకి ”డియర్ మేఘా”

Published on Aug 27, 2021 7:00 pm IST

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘా. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ ప్రేమ కథ గా వస్తున్న ఈ సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా నైజాం లో సెప్టెంబర్ 3న థియేటర్ల లోకి రానుంది. అత్యధిక కేంద్రాలలో డియర్ మేఘా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు చిత్ర నిర్మాత ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం హరి గౌర అందించగా, సినిమాటోగ్రాఫర్ గా ఐ ఆండ్రూ వ్యవహరించారు.

సంబంధిత సమాచారం :