డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘ముకుంద’

డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘ముకుంద’

Published on Dec 24, 2014 5:30 PM IST

mukunda-us-list
యంగ్ హీరో వరుణ్ తేజ్ ‘ముకుంద’ తో ఈ రోజు తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ ఎంటర్టైనర్ అన్ని చోట్ల డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. మల్టీప్లెక్స్ లతో పాటు సింగల్ స్క్రీన్ లు కూడా తొంభై శాతం ఓపెనింగ్స్ సాధించాయి. వరుసగా సెలవులు కావడంతో ఇంకా మంచి ఓపెనింగ్స్ సాధించడానికి సిద్దంగా వున్నాయి.

మిక్కీ జె మేయర్ అందించిన మెలోడియస్ సంగీతంతో పాటు వరుణ్ తేజ్ డెబ్యూ ఈ ఓపెనింగ్స్ కి కారణం అని చెప్పుకోవచ్చు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని నల్లమలుపు బుజ్జి టాగోర్ మధు సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు