డీసెంట్ టీఆర్పీ ను రాబట్టిన “మట్టి కుస్తీ”

డీసెంట్ టీఆర్పీ ను రాబట్టిన “మట్టి కుస్తీ”

Published on Mar 30, 2023 9:00 PM IST


కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ ఇటీవల రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తిలో కనిపించాడు. ఇది తెలుగులో మట్టి కుస్తీ గా విడుదలైంది. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ విష్ణు విశాల్‌తో కలిసి RT టీమ్‌వర్క్స్ మరియు విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. థియేట్రికల్ రన్ తర్వాత, సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇటీవల బుల్లితెరపై ప్రసారం కాగా, 5.54 టీఆర్పీ సాధించింది.

డబ్బింగ్ సినిమాకి 5.54 అంటే చాలా బెటర్ అని చెప్పాలి. ఈ చిత్రం లో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కరుణాస్, శ్రీజ రవి, మునిష్కాంత్, కాళీ వెంకట్ మరియు రెడ్లిన్ కింగ్స్లీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు