డేడికేటివ్ సమంత..”శాకుంతలం” డబ్బింగ్ స్టార్ట్.!

Shaakuntalam

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ చిత్రం “యశోద” తో ఆమె తన కెరీర్ లో మరో భారీ హిట్ ని సొంతం చేసుకోగా ఇక నెక్స్ట్ తన మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం అందులోని పీరియాడిక్ చిత్రం అయినటువంటి “శాకుంతలం” కూడా ఒకటి. టాలీవుడ్ గ్రాండియర్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాలు నెలకొల్పుకోగా ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేశారు.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ సినిమాపై సమంత పెట్టిన పోస్ట్ ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగాలేదని అందరికీ తెలిసిందే. మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు శాకుంతలం డబ్బింగ్ ని ఆమె స్టార్ట్ చేసేసింది. తన ఇంట్లోనే డబ్బింగ్ థియేటర్ లా మార్చుకొని శాకుంతలం కి స్టార్ట్ చేసినట్టు ఓ పోస్ట్ చేసింది. దీనితో ఈ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రంలో దేవ్ మోహన్ మేల్ లీడ్ లో నటించగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించారు.

Exit mobile version