‘ఢీ’, శ్రీను వైట్ల కెరీర్ ను మలువు తిప్పగా మంచు విష్ణు కి తన కెరీర్లో మొట్ట మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా తరువాత మంచి సక్సెస్ లు చూసిన వీరిద్దరూ అనూహ్యంగా గత కొంత కాలంగా వరస డిజాస్టర్లతో రేస్ లో బాగా వెనుకపడిపోయారు.
ఇక 12 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇప్పుడు వీరి కలయికలో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈవిషయాన్ని తాజాగా విష్ణు ధ్రువీకరించాడు. అయితే ఈ చిత్రం ఢీ కి సీక్వెల్ అనే విషయం ఫై ఆయన స్పదించలేదు. మరి ఈ చిత్రం తోనైనా మళ్ళీ వీరిద్దరు ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి. ఇక ఆచారి ఆమెరికా యాత్ర తరువాత విష్ణు నటించిన పొలిటికల్ డ్రామా ఓటర్ ఈ సమ్మర్ లో విడుదలకానుంది.


