లేకర్ హమ్ దీవానా దిల్ పై ఆశలు పెట్టుకున్న దీక్షా సేథ్

లేకర్ హమ్ దీవానా దిల్ పై ఆశలు పెట్టుకున్న దీక్షా సేథ్

Published on Jun 29, 2014 2:08 AM IST

Deeksha-Seth
అందమైన పొడుగు సుందరి దీక్షా సేథ్ చాలా రోజుల నుంచి తెలుగు చిత్రాల్లో నటించడంలేదు. అకస్మాత్తుగా హిందీ చిత్రం ‘లేకర్ హమ్ దీవానా దిల్’ లో కనపడింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రమోషన్ లో పాల్గొంటున్న దీక్షా ఈ చిత్ర విషయమై ఎంతో ఉత్సాహం గా వుంది. “నాకు చాలా టెన్షన్ గా వుంది. నాకు ఇంత మంచి లాంచ్ దొరికింది. ఈ చిత్రం విజయవంతం కావాలని దేవుడిని కోరుకుంటున్నాను”. అని దీక్షా తెలిపింది. రాజ్ కపూర్ మనువడు అర్మాన్ జైన్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు.

పలు చిత్రాలలో నటించిన దీక్షాకి బ్లాక్ బస్టర్ హిట్ ఇంతవరకు లభించలేదు. హిందీ లో అయిన దీక్షా కు కావాల్సిన హిట్ లభించాలని ఆశిద్దాం.

తాజా వార్తలు