బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనున్న దీక్షా సేథ్

బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనున్న దీక్షా సేథ్

Published on May 7, 2014 11:15 PM IST

Deeksha_seth-2

చివరి గా ‘రెబెల్’ చిత్రం లో కనపడిన దీక్షా సేథ్ కి బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ వచ్చింది. ఓ పక్క దీక్షా సేథ్ బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేస్తుందని వార్తలు చకర్లు కొడుతుంటే తన తొలి హింది చిత్రం ఏకంగా విడుదల కు సిద్ధం అయిందిన వార్తలు వస్తున్నాయి.

దీక్షా కరీనా కపూర్ సోదరుడు అయిన అర్మాన్ జైన్ తో కలసి నటించనుంది ఈ చిత్రానికి లేఖర్ హమ్ దీవానా దిల్ దర్శకత్వం వహించనున్నారు. ఎ. ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఇద్దరు స్నేహితుల సంబంధం అన్ రియలిస్టిక్ ఎక్ష్పెక్టేషన్స్ వల్ల ఎలా పాడయ్యింది అనే కధ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని జూలై 4 న విడుదల చేయనున్నారు.

తెలుగు లో అల్లు అర్జున్ తో కలసి నటించిన ‘వేదం’ చిత్రం ద్వారా పరిచయం అయిన దీక్షా ‘వాంటెడ్’ ‘మిరపకాయ’ ‘నిప్పు’ ‘ఊ కొడతార ఉల్లిక్కి పడతార’ మరియు విక్రం సరసన ఒక తమిళ్ చిత్రాల్లో నటించింది. తెలుగు లో పెద్ద హీరోల సరసన నటించనా దీక్షా తన స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ బాలీవుడ్ రంగప్రవేశం అయిన దీక్షా కి అదృష్టాన్ని పేరు ని సంపాదిస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు